రష్యా బెదిరింపులకు గురి చేస్తోంది: ఫ్రాన్స్ తీవ్ర ఆరోపణలు

by Dishanational2 |
రష్యా బెదిరింపులకు గురి చేస్తోంది: ఫ్రాన్స్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నల్ల సముద్రం మీదుగా గగన తలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫ్రెంచ్ విమానాలను కూల్చివేస్తామని రష్యా బెదిరిస్తోందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడంలో ముందుకు సాగడానికి రష్యా దూకుడు విధానాన్ని అవంభిస్తోందని చెప్పారు. అందుకే తమకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. నెల రోజుల క్రితం, రష్యా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అంతర్జాతీయ గగనతలంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నల్ల సముద్రం మీదుగా ఫ్రెంచ్ విమానాలను కూల్చివేస్తామని రష్యా దళాలు బెదిరించాయని వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో మాజీ సోవియట్ యూనియన్ ప్రవర్తనను గుర్తుచేసే విధంగా రష్యా ప్రవర్తిస్తుందని చెప్పారు. అయితే బెదిరింపు కాల్పుల్లో పాల్గొన్న ఫ్రెంచ్ విమానాల వివరాలను ఆయన వెల్లడించలేదు. 2022లో రష్యా అనుసరించిన తీరుకు, ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలకు సంబంధమే లేదని తెలిపారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పుడు ఫ్రాన్స్ రష్యాపై ఆంక్షలు విధించగా..ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫ్రెంచ్ సైనికులు ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్నాయని రష్యా సైతం ఆరోపించింది.

Next Story

Most Viewed