బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్. (Rishi Sunak ). ప్రభుత్వ ఏర్పాటుకు కింగ్ చార్లెస్ గ్రీన్ సిగ్నల్

by Disha Web Desk 19 |
బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్. (Rishi Sunak ). ప్రభుత్వ ఏర్పాటుకు కింగ్ చార్లెస్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన రిషి సునక్ బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిశారు. ప్రధానిగా తనకు సరిపడా మద్దతు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాజు చార్లెస్‌ను రిషి సునక్ కోరారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రిషిని కింగ్ చార్లెస్ ఆహ్వానించారు. దీంతో రిషి సునక్ బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సందర్భంగా రిషి సునక్ మాట్లాడారు. ప్రధానిగా లిజ్ ట్రస్ తన వంతు ప్రయత్నం చేశారని.. బ్రిటన్‌ను ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రిషి తెలిపారు. బ్రిటన్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. వాటితో మనం అద్భుతాలు సాధించగలమని ఈ సందర్భంగా రిషి తెలిపారు. కాగా, కొద్ది సేపటి క్రితమే లిజ్ ట్రస్ కింగ్ చార్లెస్‌ను కలిసి తన రాజీనామా సమర్పించి వెళ్లారు.

ఇవి కూడా చ‌ద‌వండి

1..భారత్‌కు చెందిన మహిళ- బ్రిటీష్ ప్రధాని లవ్ స్టోరీ ఏంటీ...?

2.ప్రధానిగా రిషి సునాక్ (Rishi Sunak).. నారాయణమూర్తి ఏమన్నారంటే.


Next Story

Most Viewed