ఈ అమ్మాయిలు ఇక‌పై విదేశాలకు వెళ్లి చ‌ద‌వుకోవ‌డం నిషేధం!

by Disha Web Desk 20 |
ఈ అమ్మాయిలు ఇక‌పై విదేశాలకు వెళ్లి చ‌ద‌వుకోవ‌డం నిషేధం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబాన్లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఒక సంవత్సరం దాటింది. అమెరికా దేశం నుండి విర‌మించుకున్న త‌ర్వాత అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు మహిళల హక్కుల పట్ల మరింత ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని మాటిచ్చారు. అయితే, పాలనలో పెద్దగా మార్పు రాలేదని ఇటీవలి నివేదికలు చూపిస్తున్నాయి. స్పుత్నిక్ నివేదిక ప్రకారం, కజకిస్తాన్, ఖతార్‌లలో చదువుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని విద్యార్థినుల‌కు అనుమ‌తి నిరాక‌రించారు. విదేశాల్లో చ‌దువుకోడం కోసం కాబూల్‌ను విడిచిపెట్టడానికి అనుమతిలేదని అంటున్న‌ట్లు ప‌లు నివేదిక‌లు ధృవీకరించాయి.

పురుష‌, స్త్రీ విద్యార్థులు ఇద్దరూ ఉన్నత చదువుల కోసం ప‌లు దేశాల‌కు వెళ్లాల్సి ఉండ‌గా, చివరకు పురుష విద్యార్థుల‌కు మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లేందుకు అనుమతినిచ్చిన‌ట్లు స్పుత్నిక్ శుక్రవారం త‌మ నివేదికలో పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో తాలిబాన్లు తీసుకొచ్చిన అనేక సంస్కరణల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల విద్యా హక్కుపై ఇది తాజా దాడి. ప‌రిపాల‌న‌ను చేజిక్కించుకున్న త‌ర్వాత తాలిబాన్లు, పాఠశాల వ్యవస్థలో అనేక లింగ ఆధారిత నియమాలు ప్రవేశపెట్టారు. కొన్ని చోట్ల, బాలికలను ఆరవ తరగతికి మించి చదవడానికి అనుమతించలేదు. ఇటీవ‌ల, ఓ విద్యార్థిని ఇండియాలో త‌న చ‌దువు కొన‌సాగించ‌డానికి అనుమ‌తి ఇవ్వాలంటూ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ కూడా రాసింది.

Next Story

Most Viewed