అమెరికా ప్రెసిడెంట్‌గా నా ప్రయారిటీ ఆయనే: పుతిన్

by Dishanational4 |
అమెరికా ప్రెసిడెంట్‌గా నా ప్రయారిటీ ఆయనే: పుతిన్
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా, అమెరికా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు కూడా రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్ దేశానికి అమెరికా ప్రభుత్వం వందల కోట్ల ఆర్థికసాయం చేస్తోంది. ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే మారబోయే అమెరికా నాయకత్వం ఎఫెక్టు రష్యాపైనా ఉంటుంది. ఈనేపథ్యంలో ‘‘అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో మీ ప్రయారిటీ ఎవరు ?’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రశ్నిస్తే ఒక సమాధానమిచ్చారు. ‘‘నేను డొనాల్డ్ ట్రంప్ కంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను’’ అని పుతిన్ తెలిపారు. ‘‘బైడెన్ అమెరికాలోని నాయకులందరినీ కలుపుకొని నడవగలరు. రష్యా దృక్కోణం ప్రకారం బైడెన్ మరోసారి అమెరికా ప్రెసిడెంట్‌ అయితేనే చాలా బెటర్’’ అని ఆయన చెప్పారు. ‘‘బైడెన్ అనుభవజ్ఞుడు.. రాజకీయాల్లో చాలా సీనియర్.. ఆయనను అమెరికన్ ప్రజలు విశ్వసిస్తారు’’ అని పుతిన్ పేర్కొన్నారు. బైడెన్ ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ‘‘బైడెన్ హెల్త్ గురించి అప్‌డేట్స్ చెప్పడానికి నేనేం డాక్టర్‌ను కాదు. చివరిసారిగా 2021 జూన్‌లో బైడెన్‌ను కలిశాను. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అప్పట్లో నాకు అనిపించింది’’ అని పుతిన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed