బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్: ఢాకాలో ఓటేసిన ప్రధాని షేక్ హసీనా

by Dishanational2 |
బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్: ఢాకాలో ఓటేసిన ప్రధాని షేక్ హసీనా
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్..5గంటల వరకు కొనసాగనుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజధాని ఢాకాలో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా 42,000 పోలింగ్ స్టేషన్లలో 119.6 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకోకున్నారు. మొత్తం 300 స్థానాలకు గాను 299 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. 436 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు 27 రాజకీయ పార్టీలకు చెందిన 1,500 మంది క్యాండిడేట్స్ బరిలో నిలిచారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) ప్రధాని హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 48గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేగాక ఎలక్షన్స్‌కు ముందు పలు హింసాత్మక ఘటనలు సైతం చోటు చేసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.


Next Story

Most Viewed