విపత్కర సమయంలోనూ వక్రబుద్ధి ప్రదర్శించిన పాక్..!

by Disha Web Desk 19 |
విపత్కర సమయంలోనూ వక్రబుద్ధి ప్రదర్శించిన పాక్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. తుర్కియేలో సంభవించిన భూకంప ప్రమాద సమయంలో మానవత్వంతో మసులుకోవాల్సిన పాకిస్థాన్ అందుకు భిన్నంగా కాఠిన్యాన్ని చూపింది. సహాయక సామాగ్రితో వెళ్తున్న భారత విమానానికి ఎయిర్ స్పేస్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సాధారణ సమయంలోనే కాదు కష్టకాలంలోనూ తనది వక్రబుద్ధేనని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భూకంపం ధాటికి తుర్కియే దేశం అల్లకల్లోలంగా మారింది. దీంతో ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. ప్రధాని మోడీ నిర్ణయంతో భారత నుంచి తొలి విడత సహాయక సామగ్రితో ఎన్‌డీఆర్ఎఫ్ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండోన్ ఎయిర్‌ బేస్ నుంచి మంగళవారం ఉదయం తుర్కియేకు బయలుదేరింది.

ఇందులో 100 మందితో కూడిన రెండు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది మరియు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో పాటు అవసరమైన వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ మిషన్లతో పాటు సహాయ ప్రయత్నాలకు అవసరమైన ఇతర పరికరాలతో సహా సీ17 విమానం ఈ ఉదయం టర్కీకి బయలుదేరింది. అయితే ఎమర్జెన్సీ సేవల కోసం బయలుదేరిన భారత విమానానికి తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తుర్కియోలో సంభవించిన విపత్కర పరిస్థితిపై ప్రపంచమంతా ఆపన్నహస్తం అందిస్తుంటే పాకిస్థాన్ మాత్రం ఇలాంటి కష్టసమయంలోనూ తన అల్ప బుద్ధి ప్రదర్శించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే తన ఎయిర్ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు నిరాకరించినప్పటికీ భారత్ మరో మార్గంలో గమ్యస్థానానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరో వైపు తుర్కియోలో మృతుల సంఖ్య 4500 దాటింది. మానవతా సహాయం కోసం భారత ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్ లైన్ మానవత్వంతో ముందుకు వచ్చింది. ఆ దేశానికి అవసరమైన సామగ్రి తరలింపు కోసం ఇదివరకే షెడ్యూల్ చేసిన సర్వీసులలో కార్గో సేవలను ఉచితంగా నడుపుతామని పేర్కొంది.



Next Story

Most Viewed