సగం దేశం నీటమునిగింది.. అవే కారణం..

by Dishafeatures2 |
సగం దేశం నీటమునిగింది.. అవే కారణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఋతుపవనాలు పలు దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఒక్కసారిగీ భారీ వర్షాలు కురవడంతో ఇటీవల భారత్‌ తీవ్రస్థాయిలో వరదలను ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం పాక్ పరిస్థితి అదే తరహాలో ఉంది. పాకిస్తాన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. వీటి కారణంగా సగం పాకిస్తాన్ నీట మునిగిందని, ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పాకిస్తాన్ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. దేశంలో సంభవించిన అసాధారణ వరదల కారణంగానే పాకిస్తాన్ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుందని కథనాలు ప్రచురితం అవుతున్నాయి.

ఈ వరదలకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విపత్తు నిర్వహణ శాఖ లెక్కల ప్రకారం ఈ వరదల వల్ల 33 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారని, 1041 మంది ప్రజలు మృత్యువాత పడ్డారని తెలపారు. అంతేకాకుండా ఈ లెక్కలు కేవలం ఆగస్టు 27 వరకు వచ్చినవి మాత్రమే అని వెల్లడించారు.

Next Story