దేశం కోసం వన్డే వరల్డ్‌కప్ ఆడగలవా?

by Disha Web Desk 21 |
దేశం కోసం వన్డే వరల్డ్‌కప్ ఆడగలవా?
X

లండన్: టీ20 ఫైనల్లో ఇంగ్లాండ్‌ను గెలిపించిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ సారధి మైఖేల్ వాన్ ట్వీట్ చేశారు. 'దయచేసి మీరు తదుపరి 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఆడగలరా, దేశం కోసం అడుగుతున్నా' అని బెన్ స్టోక్స్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 2019లో 50 ఓవర్ల వరల్డ్ కప్ గెలవడంలోనూ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచుల్లో ఫైనల్లోనూ చివరి వరకు ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అయితే ఈ ఏడాది జూలైలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డే తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన చివరి వన్డే మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. గతంలోనూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టోక్స్, తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకుని రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాన్ ట్వీట్‌తో స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి. కాగా, వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed