బ్రిటన్‌ ప్రధానిగా 'భారతీయుడు'.. దాదాపు ఖరారు!

by Disha Web Desk 21 |
బ్రిటన్‌ ప్రధానిగా భారతీయుడు.. దాదాపు ఖరారు!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ ప్రధానికిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగు దూరంలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాని రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకున్నారు. తనకు 144 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు రిషి సునాక్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు. ఈ క్రమంలో 23 మంది ఎంపీల మద్దతు పెన్నీ మోర్డాంట్ కూడబెట్టినట్లు సమాచారం. ఒకవేళ పెన్నీ ప్రధాని రేసులో నిలవాలంటే వందమంది మద్దతు తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల పెన్నీ మోర్డాంట్ తన బలం నిరూపించుకోలేకపోతే రిషి సునాక్‌ని ప్రధానిగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ సాయంత్రమే రిషిని ప్రధానిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

Next Story

Most Viewed