చైనాను ఎదుర్కోవడంలో భారత్ కీలక పాత్ర

by Dishanational2 |
చైనాను ఎదుర్కోవడంలో భారత్ కీలక పాత్ర
X

వాషింగ్టన్ డీసీ: చైనాను ఎదుర్కోవడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్‌లో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి కానుందని అమెరికా నేవీ చీఫ్ ఆడమ్ మైక్ గిల్డే అన్నారు. శనివారం వాషింగ్టన్‌ నిర్వహించిన సెమినార్‌లో గిల్డే హాజరై ప్రసంగించారు. భారత్ వల్ల చైనా తూర్పు వైపు ఫోకస్ చెయ్యలేదన్నారు. చైనా కేవలం దక్షిణ చైనా సముద్రం, తైవాన్ సంధిపై మరీ ఎక్కువ ఫోకస్ చెయ్యకుండా ఉండేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్‌లో భారత్ తమకు కీలక భాగస్వామిగా మారనుందని, అందుకే భారత్‌లో ఎక్కువ రోజులు ఉన్నానని గిల్డే పేర్కొన్నారు. అమెరికాకు హిందూ మహాసముద్రం కీలకంగా మారనుందన్నారు.

భారత్-చైనాకు సరిహద్దు వివాదం ఉందని, రెండు వైపులా దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్నారన్నారు. కాగా, అమెరికా-భారత్ బలగాలు అక్టోబరులో ఉత్తరాఖండ్ వేదికగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయని గిల్డే పేర్కొన్నారు. అయితే ఈ 'యుద్ధ అభ్యాస్' విన్యాసాలు సాధారణంగా చైనా సరిహద్దుకు 300 కి.మీ. దూరంలో జరిగేవి. కానీ ఈ సారి 100 కి.మీ దూరంలోనే నిర్వహించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారత్ చైనాకు గట్టి వార్నింగ్ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నావాషింగ్టన్ డీసీ: చైనాను ఎదుర్కోవడంతో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, భవిష్యత్‌లో అమెరికాకు భారత్ కీలక భాగస్వామి కానుందని అమెరికా నేవీ చీఫ్ ఆడమ్ మైక్ గిల్డే అన్నారు..

Next Story

Most Viewed