భారత్ తన నిర్ణయాలు తాను తీసుకోగలదు: యూఎస్

by Dishafeatures2 |
భారత్ తన నిర్ణయాలు తాను తీసుకోగలదు: యూఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా నిర్వహించిన మిలటరీ డ్రిల్స్‌లో భారత్ పాల్గొనడంపై యూఎస్ స్పందించింది. భారత్ తన నిర్ణయాలను తాను తీసుకోగలదని పేర్కొంది. న్యూఢిల్లీ తన సొంత నిర్ణయాలు తీసుకోగలదంటూ రష్యా మిలటరీ ఎక్సర్సైజ్‌లో భారత్ పాల్గొనడాన్ని ప్రశ్నించేందుకు యూఎస్ నిరాకరించింది. ఈ విషయంపై యూఎస్ పెంటాగాన్ ప్రతినిధి బ్రిగ్ గెన్ ప్యాట్రిక్ రైడర్ స్పందించారు. ఈ సందర్బంగా రష్యా నిర్వహించిన మల్టీ నేషనల్ మిలటరీ ఎక్సర్సైజ్‌లో భారత్ పాల్గొనడం ప్రశ్నించడాన్ని నిరాకరించారు.

భారత్ ఓ సార్వభౌమాధికార దేశం అని, తన సొంత నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్న దేశమని, భారత్‌తో యూఎస్ ఇంకా కలిసే పనిచేస్తుందని ఆయన తెలిపారు. 'భారత్‌తో మా భాగస్వామ్యాన్ని మేము మెచ్చుకుంటున్నాం. భారత్ మాకున్న ముఖ్యమైన భాస్వామి. మేము వాళ్లతో కలిసి పనిచేసేందుకు చూస్తున్నాం. భారత్ ఓ సార్వభౌమాధికార దేశం. ఎవరితో ఎక్సర్సైజ్ చేయాలో భారత్ నిర్ణయించుకోగలదు' అని ఆయన అన్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో రష్యా అంతటా నిర్వహించిన వొస్టోక్ 2022 ఎక్సర్సైజ్‌లో పాల్గొన్న దేశాలలో భారత్ కూడా ఒకటి.



Next Story

Most Viewed