గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. 10 మంది మృతి (వీడియో)

by Disha Web Desk 12 |
గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. 10 మంది మృతి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మిలిటరీ ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన ఎయిర్ షో తీవ్ర విషాదానికి దారి తీసింది. గాల్లోకి ఎగిరిన హెలీకాఫ్టర్లు రెండు ఒకదానికి మరొకటి ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దూరం నుంచి ప్రదర్శనలో భాగంగా వస్తున్న హెలీకాఫ్టర్లు రెండు అదుపు తప్పి ఒకదానితో మరొకటి ఢీకొట్టాయి. దీంతో ఆ రెండు నేలపై పడిపోవడం ఆ వీడియో లో స్పష్టంగా కనిపించింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed