పాక్‌లో భారీ వర్షాలు..8 మంది పిల్లలు మృతి

by samatah |
పాక్‌లో భారీ వర్షాలు..8 మంది పిల్లలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: వాయువ్య పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల వల్ల జనజీవనం స్థంబించింది. దీని కారణంగా అనేక ఇండ్లు కూలిపోవడంతో పాటు పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు విపత్తు నిర్వహణ అధికార ప్రతినిధి అన్వర్ షాజాద్ తెలిపారు. దీంతో పలు ఘటనల్లో గత 24గంట్లోనే 8 మంది పిల్లలు మరణించగా..మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్టు వెల్లడించారు. మృతుల్లో 3 నుంచి 7ఏళ్ల వయసున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. ఈ నెల ప్రారంభంలోనూ ఇదే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల సుమారు 30 మందికి పైగా మరణించారు.

‘మార్చి 29, 30 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దులో భారీ వర్షాల కారణంగా 1,500 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది. వందలాది ఇండ్లు కూలిపోయాయి. ఏడు ప్రావిన్స్‌లలో మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది’ అని యూఎన్ ఆఫీస్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ తెలిపింది. ఉత్తర ఫర్యాబ్, తూర్పు నంగర్హార్, మధ్య దైకుండి ప్రావిన్సులు ఎక్కువగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. కాగా, నవంబర్‌లో కాకుండా ఫిబ్రవరిలో ప్రారంభమైన శీతాకాలపు వర్షాలతో పాక్ ఈ ఏడాది తీవ్ర నష్టం ఎదుర్కుంటున్నది.Next Story

Most Viewed