దక్షిణాఫ్రికాలో గ్యాంగ్‌స్టర్ అరెస్ట్: ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసులో ప్రమేయం

by Dishanational2 |
దక్షిణాఫ్రికాలో గ్యాంగ్‌స్టర్ అరెస్ట్: ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసులో ప్రమేయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త, ప్రముఖ గ్యాంగ్ స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని ఎట్టకేలకు దక్షిణాఫ్రికాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. నియాజీ 2016లో బెంగళూరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు రుద్రేష్‌ను హత్య చేశాడు. అనంతరం పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ పలు దేశాల్లో నివాసాలు మారుస్తూ ఉన్నాడు. నియాజీ కదలికలను గమనించిన గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అతని లోకేషన్‌ను ట్రాక్ చేసి.. ఎన్ఐఏకు కీలక సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎట్టకేలకు తాజాగా దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశారు. ఆయనను భారత్‌కు తీసుకురావడానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి హత్యలో ప్రమేయం ఉందని ఆరోపించినలు ఉన్నందున నియాజీ ప్రస్తుతం బెంగళూరులో విచారణను ఎదుర్కొంటాడని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రుద్రేష్‌ హత్య కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. 2016లో సంఘ్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఇంటికి తిరిగి వస్తుండగా, బెంగళూరులోని శివాజీ నగర్‌లో మెరుపుదాడి చేసిన దుండగులు ఆయనపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో రుద్రేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐకు అప్పగించింది. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అజీమ్ షరీఫ్‌ను 2016 నవంబర్‌లో అరెస్టు చేసింది. కాగా, నియాజీని పట్టించిన వారికి రూ.5లక్షల రివార్డును సైతం ఎన్ఐఏ గతంలో ప్రకటించింది.



Next Story

Most Viewed