అంచనాలు పెంచేస్తున్న ‘రామాయణ’.. ఫస్ట్ పార్ట్‌కు అన్ని కోట్లా..?

by sudharani |
అంచనాలు పెంచేస్తున్న ‘రామాయణ’.. ఫస్ట్ పార్ట్‌కు అన్ని కోట్లా..?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్‌డేట్ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం విశేషం. కానీ.. ఇటీవల షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు మాత్రం నెట్టింట లీక్ అయ్యాయి.

అందులో సాయి పల్లవి, రణ్‌బీర్ సీతారాములుగా ఆకట్టుకున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ‘రామాయణ’ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సినిమాపై భారీ అంచనాలు పెంచేవిధంగా ఉన్నాయి. వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమా మొదటి పార్ట్‌కే ఏకంగా రూ. 835 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ప్రజెంట్ ఈ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Next Story