భారత్ చంద్రుడిపై అన్వేషణలో ఉంటే.. పాకిస్తాన్ డాలర్ల కోసం వేడుకుంటుంది: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్

by Mahesh |
భారత్ చంద్రుడిపై అన్వేషణలో ఉంటే.. పాకిస్తాన్ డాలర్ల కోసం వేడుకుంటుంది: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత దేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈరోజు భారత్ చంద్రుడిపైకి చేరుకుందని, జీ20 సమావేశం భారత్‌లో జరుగుతోంది. కానీ మా పాకిస్తాన్ మాత్రం డాలర్ల కోసం భిక్షాటన చేస్తూ పాకిస్తాన్ బీజింగ్, అరబ్ రాజధానులకు వెళ్లాల్సి వస్తోందని నవాజ్ షరీఫ్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ గందరగోళానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, మాజీ స్పై మాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆరోపించారు. అలాగే పాకిస్తాన్ అప్పులు తీర్చలేని స్థితిలో ఉండటం విచారకరమని ఆయన అన్నారు.

Next Story