యూఎన్ఎస్‌సీలో ఇండియా లాంటి దేశాలు శాస్వత సభ్యులు కాదు.. ప్రశ్నించిన జెలెన్‌స్కీ..

by Dishafeatures2 |
యూఎన్ఎస్‌సీలో ఇండియా లాంటి దేశాలు శాస్వత సభ్యులు కాదు.. ప్రశ్నించిన జెలెన్‌స్కీ..
X

దిశ, వెబ్‌డెస్క్: యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి)లో శాస్వత సభ్యత్వంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మండలిలో ఇండియా, బ్రెజిల్, జపాన్, ఉక్రెయిన్ వంటి దేశాలకు ఎందుకు శాస్వత సభ్యులు కాదని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. బుధవారం జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్‌లో జెలెన్‌స్కీ ప్రీ రికార్డెడ్ మెసేజ్‌లో పేర్కొన్నారు. 'ఇది పరిష్కారమయ్యే రోజు వస్తుంది. యూఎన్ పునఃవ్యవస్థీకరణ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అదెలా ముగిసింది? ఎటువంటి ఫలితాలు లేవా?' అని జెలెన్‌స్కీ అన్నారు.

'మేము అనుసరిస్తున్న శాంతి సూత్రాన్ని పరిశీలిస్తే.. ఇప్పటికే అది యూఎస్ వాస్తవ సంస్కరణగా మారుతుందని గమనించగలుగుతారు. మా ఫార్ములా యూనివర్సిల్, అది ఉత్తర, దక్షిణ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ప్రపంచ మెజారిటీకి ఈ సూత్రం పిలుపునిస్తోంది. అంతేకాకుండా ఇన్నాళ్లూ వినిపించకుండా ఉన్నవారి ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలో అత్యధిక భాగం, యూరప్‌లోని తూర్పు, కేంద్ర భాగం వీటో హక్కును పాటించినప్పుడు ఇది అసమతుల్యత' అని జెలెన్‌స్కీ అన్నారు.

అంతేకాకుండా దీని గురించే ఉక్రెయిన్ మాట్లాడుతుందని, యూఎన్‌లో శాస్వత సభ్య దేశమైనా రష్యా నుంచి ఇటువంటి విషయాలు ఎప్పుడైనా విన్నారా? కొన్ని కారణాల వల్ల? ఏం కారణాల వల్ల? జపాన్, బ్రెజిల్, టర్కీ, ఇండియా, జర్మనీ, ఉక్రెయిన్ ఏ దేశానికి శాస్వత సభ్యత్వం ఎందుకు కల్పించలేదు. ఈ సమస్య పరిష్కారమయ్యే రోజు వస్తుంది' అని జెలెన్‌స్కీ అన్నారు.



Next Story

Most Viewed