Pakistan | తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. కరిగిపోతున్న విదేశీ కరెన్సీ నిలువలు

by Dishanational1 |
Pakistan | తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. కరిగిపోతున్న విదేశీ కరెన్సీ నిలువలు
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. తరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు.. గుదిబండలా మారుతున్న రుణభారం పాక్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాక్ నిలిచింది. అక్కడ రిటైల్ ధరల ద్రవ్యోల్బణం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 36.4 శాతం పెరిగింది.

ధరల పెరుగుదల విషయంలో శ్రీలంకనూ ఇస్లామాబాద్‌ మించిపోయింది. ప్రస్తుతం అప్పులు చెల్లించలేని దుస్థితి పాక్ కు ఏర్పడింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ నుంచి ఆర్థిక సాయం పొందినా మెరుగుపడలేదు.

నిజానికి 1960,1990 మధ్య కాలంలో దక్షిణాసియాలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా పాక్ నిలిచింది. 1990 లో పాకిస్తాన్ ‌లో ఒక వ్యక్తి సగటు సంపాదన ఇండియాతో పోలిస్తే దాదాపు 25శాతం అధికం. అలాంటి పాక్ ప్రస్తుతం దారుణమైన దుస్ధితిలోకి జారిపోయింది. పాక్ లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం 35 శాతానికి మించి ఎగబాకింది. గత 48 ఏళ్లలో ఇదే గరిష్టం.

ప్రస్తుతం పెరిగిన ధరలను భరించే స్ధోమత లేక పాక్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్క లీటర్ పెట్రోల్ ధరని ఒకసారి రూ. 10 లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 282 లకు చేరింది. అలాగే కిరోసిన్ ధరను కూడా రూ. 5.78 పెంచింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు పాకిస్తాన్ ఆర్ధిక శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆహార ఉత్పత్తుల ధరలు మరింత పెరగడంతో పేద ప్రజలపై ద్రవ్యోల్బణం రేటు 50 శాతానికి దగ్గరలో ఉంది.

నిలిచిపోయిన ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) బెయిలవుట్ ను పునఃప్రారంభించడానికి స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) సాధించే దిశగా అధికార యంత్రాంగం పురోగతి సాధించకపోవడంతో ఈ విపత్తు సంభవించింది. ఇది ఆ దేశ కరెన్సీ పతనం అవ్వడానికి, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి, ద్రవ్యోల్బణ రేటు పెరగడానికి కారణం అవుతుంది.

మరొకవైపు, పాకిస్తాన్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది, ఇది ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ నిధులు పొందడానికి ఉన్న అడ్డంకిని తొలగించింది. 6.5 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ పునరుద్ధరణ కోసం ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ 3 బిలియన్ డాలర్లను పొందాలని అంతర్జాతీయ సంస్థ గతంలో షరతు విధించింది.

బెయిలవుట్ ప్యాకేజీ పునరుద్ధరణకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పొందిన పాకిస్తాన్, ఇప్పుడు 1.1 బిలియన్ డాలర్లను పొందడానికి సిద్ధంగా ఉంది. ఇది తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ కు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కేవలం 4 బిలియన్ డాలర్ల నిల్వలతో దివాళా దిశగా పయనిస్తుంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ఐఎంఎఫ్ 2 శాతం నుంచి కేవలం 0.5 శాతానికి తగ్గించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అలాగే పెరుగుతున్న నిరుద్యోగ రేటు కారణంగా ఐఎంఎఫ్ పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి రేటును తగ్గించింది.


ఇవి కూడా చదవండి:

Sienna Weird: మిస్‌ యూనివర్స్‌ ఫైనలిస్ట్‌ సియెన్నా వీర్‌ మృతి.. 23 ఏళ్లకే తీరిన ఆయువు!

Pakistan | భారత్‌తో దోస్తీ కోసం పాకిస్తాన్ అడుగులు.. 600 మంది భారత జాలర్ల విడుదలకు నిర్ణ‌యం



Next Story

Most Viewed