రష్యా అధ్యక్షుడికి బైడెన్ హెచ్చరికలు

by Disha Web Desk 16 |
రష్యా అధ్యక్షుడికి బైడెన్ హెచ్చరికలు
X

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి హెచ్చరికలు చేశారు. యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు లేదా వ్యుహాత్మక అణు దాడులు చేయొద్దని అన్నారు. ఈ మేరకు సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అయితే అలాంటి దాడులకు పాల్పడితే రష్యా పర్యవసనాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అన్నారు. రష్యా గతంలో కంటే ఎక్కువగా పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని బైడెన్ చెప్పారు. రష్యా వైఖరిపై ఆధారపడి ప్రతిస్పందన ఎలా ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించే సమయంలో పాశ్చాత్య దేశాలు ఈ ప్రత్యేక మిలిటరీ అపరేషన్‌లో జోక్యం చేసుకుంటే అణు ఆయుధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు.



Next Story

Most Viewed