అతి తీవ్రమైన వేడి గాలులు.. హజ్ యాత్రలో 550 మంది మృతి

by Mahesh |
అతి తీవ్రమైన వేడి గాలులు.. హజ్ యాత్రలో 550 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ముస్లిం మతస్తులకు సౌదీ అరేబియాలో ఉన్న హజ్ అత్యంత పవిత్ర ప్రాంతం.ఇక్కడికి ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైన వెళ్లాలనే కోరికతో ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం హజ్ యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా సౌదీ పూర్తిగా ఎడారి ప్రాంతం కావడంతో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే అధిక వేడిని తట్టుకోలేక పోయిన వివిధ ప్రాంతాలకు చెందిన 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృత్యువాత పడ్డారు. వారిలో అత్యధికంగా ఈజిప్షియన్ల 232 మంది ఉండగా.. 60 మంది జోర్డానియన్లు కూడా మృతి చెందారు. ప్రస్తుతం హజ్ యాత్ర కొనసాగుతున్న ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో యాత్రికులు ఒకే ప్రదేశంలో గుమిగూడటంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఎండ వేడి వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఊపిరి ఆడక చనిపోయిన వారు అధికంగా ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. ఇదే హజ్ యాత్రలో గత సంవత్సరం ఏకంగా 240 మంది చనిపోయినట్లు తెలిపారు.Next Story

Most Viewed