డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా.. ట్విట్టర్‌లో ప్రధానికి రిజైన్ లెటర్!

by Disha Web Desk 19 |
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా.. ట్విట్టర్‌లో ప్రధానికి రిజైన్ లెటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. సొంత మంత్రిత్వ శాఖలోని సిబ్బందిపై రాబ్ బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులకు సంబంధించి అధికారిక ఫిర్యాదు పైన స్వతంత్ర దర్యాఫ్తు చేపట్టారు. దర్యాప్తు నివేదిక ప్రధాని రిషి సునాక్‌కు అందిన కొద్ది గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు అందించిన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

విచారణ ప్రమాదకరమైన దృష్టాంతాన్ని నెలకొల్పిందని, అయితే తాను ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని రాబ్ లేఖలో పేర్కొన్నారు. తాను విచారణను కోరుకున్నానని, ఏవైనా బెదిరింపులు ఉన్నట్లు తేలితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, తాను తన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని విశ్వసిస్తున్నానని చెప్పారు. కాగా డొమినిక్ రాబ్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఉపప్రధానిగా బాధ్యతలు చేట్టారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలతో సునాక్ ప్రభుత్వంలో కీలక పదవులకు రాజీనామా చేసిన వ్యక్తుల్లో డొనమిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం.



Next Story

Most Viewed