రెండు చోట్ల బాంబు పేలుళ్లు: ఎన్నికల వేళ పాక్‌లో ఉద్రిక్తత

by Dishanational2 |
రెండు చోట్ల బాంబు పేలుళ్లు: ఎన్నికల వేళ పాక్‌లో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో గురువారం(ఫిబ్రవరి) 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక రోజు ముందు పాక్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. పిషిన్ నగరంలోని స్వతంత్ర అభ్యర్థి అస్ఫంద్ యార్ ఖాన్ కాకర్ కార్యాలయం వద్ద మొదటి పేలుడు సంభవించింది. అనంతరం కిలా సైఫుల్లా నగరంలో జమియాత్-ఉలేమా-ఎ-ఇస్లాం పార్టీ అభ్యర్థి మౌలానా అబ్దుల్ వాసే కార్యాలయంలో రెండో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనల్లో 22 మంది మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులిద్దరూ సురక్షితంగా ఉన్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ పోస్టులు, ఎన్నికల ప్రచార కార్యాలయాలు, ర్యాలీలపై గ్రెనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి పాకిస్థాన్ ఎన్నికల సంఘం పోలీసుల నుంచి నివేదిక కోరింది. అయితే ఈ అటాక్‌కు పాల్పడింది ఎవరనేది వెల్లడి కావాల్సి ఉంది. కాగా, ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు పెరగడం పాక్ లో ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ బూతుల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.



Next Story

Most Viewed