పాక్ పీఎం రేసు నుంచి తప్పుకున్న బిలావల్ భుట్టో

by Dishanational1 |
పాక్ పీఎం రేసు నుంచి తప్పుకున్న బిలావల్ భుట్టో
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ప్రధాని రేసు నుండి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వంలో భాగం కాకుండా తమ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. పీపీపీ అత్యున్నత స్థాయి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ పొందడంలో విఫలమైన కారణంగా ప్రతిపక్షంలో ఉండేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రధాని అవుతారని ప్రకటించిన గంటల వ్యవధిలో బిలావల్ భుట్టో మద్దతివ్వడం ఆశ్చర్యకరం. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పడానికి అన్ని పార్టీలతో చర్చించడానికి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు బిలావల్ భుట్టో వెల్లడించారు. పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నిరాకరించింది. అందుకే తానే ప్రధాని పదవి కోసం పోటీలో ఉండట్లేదని బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు.



Next Story