కెన్యాలో దారుణ ఘటన.. 201 మంది మృతికి కారణమైన చర్చి ఫాదర్

by Disha Web Desk 2 |
కెన్యాలో దారుణ ఘటన.. 201 మంది మృతికి కారణమైన చర్చి ఫాదర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కెన్యాలో ఓ చర్చి పాస్టర్ మాటలు విని ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకొన్న ఘటన కలకలం రేపుతోంది. గతనెల నుంచి అధికారులు షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా పాస్టర్ మాటలు విని ఉపవాసం చేసి ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది మిస్సయ్యారని...వీరంతా ఎక్కడో రహస్య ప్రాంతంలో నిరాహారదీక్ష చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, 2019లో పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ ఈ అటవీ ప్రాతంలోని కిలిఫీ అనే చోట 800 ఎకరాల్లో విస్తరించిన ప్రాపర్టీలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని తన అనుచరులకు ఉద్బోధించాడు. దీంతో అతడి అనుచరులు నిరాహార దీక్షలు మొదలుపెట్టారు.

దీంతో డజన్ల సంఖ్యలో భక్తులు ప్రాణాలు విడిచారు. వీరందరిని ఆ ప్రాపర్టీలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కెన్యా అధికారులు దాడులు చేసి గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100కుపైగా మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షలు నిర్వహించారు. చాలా మంది ఆహారం తినక, గొంతు నులమడం, ఆయుధాలతో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు కూడా అదృశ్యమైనట్లు కనుగొన్నారు. మెకంజీ భార్య సహా 16 మందిని అధికారులు అదుపులోకి తీసుకొని గత నెల కోర్టులో ప్రవేశపెట్టారు. దాదాపు 610 మంది మిస్సయినట్లు కోస్ట్‌ రీజియన్‌ కమిషనర్‌ రోడ వెల్లడించారు. మరోవైపు అధికారులు దాడులు చేసి చాలా మంది బాధితులను విడిపించారు. వీరంతా నడవలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం.

Read more:

హాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన స్టార్ నటి.. ఆ వివాదమే కారణమా?



Next Story

Most Viewed