ఆ డాటా చైనా ప్రభుత్వం కలెక్ట్ చేయగలదు.. ట్విట్టర్‌కు ఎఫ్‌బీఐ హెచ్చరిక

by Dishafeatures2 |
ఆ డాటా చైనా ప్రభుత్వం కలెక్ట్ చేయగలదు.. ట్విట్టర్‌కు ఎఫ్‌బీఐ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలు చైనాకు వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. ఇటీవల చైనా పాల్పడుతున్న వికృత చేష్టలు, కరోనా మహమ్మారిని చైనానే విడుదల చేసిందన్న ఆరోపణల కారణంగా ప్రపంచంలో డ్రాగన్ కంట్రీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే, తాజాగా ట్విట్టర్ మాజీ ఉద్యోగి విజిల్‌ బ్లోవర్‌(ఓ సంస్థ ఉద్యోగి అదే సంస్థకు చెందిన సమాచారాన్ని ప్రజలకు అనధికారికంగా తెలిపే వ్యక్తి)గా మారిన పీటర్ జట్కో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్‌కు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసిందని, సంస్థ కనీసం ఒక్క చైనా ఏజెంట్ అయినా పనిచేస్తున్నారని వారు తెలిపారని ట్విట్టర్ మాజీ ఎక్స్‌క్యూటివ్ పీటర్ జట్కో చెప్పుకొచ్చాడని సెనేటర్ చక్ గ్రాస్లే తెలిపారు.

అంతేకాకుండా కొందరు ట్విట్టర్ వినియోగదారుల డాటాను చైనా ప్రభుత్వం కలెక్ట్ చేయగలదని ట్విట్టర్ ఉద్యోగుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారని జట్కో వెల్లడించాడు. అయితే జట్కో ట్విట్టర్ సెక్యూరిటీ హెడ్‌గా పనిచేసేవాడు. దీంతో అతడు చెప్పే వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. అతడు చైనా ఏజెన్సీలతో చేతులు కలిపాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.



Next Story