బ్రెజిల్‌లో కూలిన విమానం.. 14 మంది మృతి

by Shiva Kumar |
బ్రెజిల్‌లో కూలిన విమానం.. 14 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ తెలిపారు. రాష్ట్ర రాజధాని మనౌస్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న బార్సెలోస్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'శనివారం బార్సిలోస్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బాధితులైన 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను' అని ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తన 'X' (గతంలో ట్విట్టర్‌) ఖాతాలో షేర్ చేశారు.

Next Story

Most Viewed