కరోనా కొత్త రూపంతో ప్రపంచం అప్రమత్తం

by  |
కరోనా కొత్త రూపంతో ప్రపంచం అప్రమత్తం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కొత్త రూపాంతరం స్ట్రెయిన్‌తో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అన్ని దేశాల్లో ఎయిరుపోర్టుల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిన ఆయా ప్రభుత్వాలు.. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి రికార్డుల పరిశీలనతో బిజీ అయ్యారు. అయితే, కరోనా మ్యూటేషన్ అనేది కేవలం బ్రిటన్‌లో మాత్రమే అయిందా అంటూ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అన్ని దేశాల్లో జరిగే అవకాశం ఉందా అన్న అంశాలపై వైద్య నిపుణులు పరిశోధనలు మొదలుపెట్టారు.

ఇది ఇలా ఉంటే కొత్త కరోనాకు ప్రస్తుత వ్యాక్సిన్‌ పనిచేయకవచ్చని ఫైజర్ కంపెనీ తెలుపడంతో ఆందోళనలు మళ్లీ మొదలు అయ్యాయి. అలాగే కొత్త కరోనాకు మరో 6 వారాల్లోనే వ్యాక్సిన్‌ను రూపొందిస్తామని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సారి క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడులపైన స్ట్రెయిన్ ప్రభావం పడింది. ఇప్పటికే వేడుకలు నిర్వహించవద్దని యూరప్ దేశాలు అధికారికంగా ప్రకటించాయి. దీనికి తోడు వైరస్‌ ఎఫెక్ట్‌తో అతి చిన్న దేశమైన భూటాన్‌ లాక్‌డౌన్ ప్రకటించింది. భారత్‌లో కూడా పలు ప్రభుత్వాలు బహిరంగ వేడుకలు రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు



Next Story

Most Viewed