కరోనాను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకు నిధి!

by  |
కరోనాను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకు నిధి!
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాలో మొదలై సుమారు 60 దేశాలకు పాకిన కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందడుగు వేసింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా మరణాలు సంభవించగా, మరో 90 వేల మంది కరోనా బాధితులు ఉన్నారు. ఎక్కువ దేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి ప్రపంచ బ్యాంకు సాయం చేయడానికి సిద్ధమైంది. ఇక ఇండియాలోనూ ఇప్పటివరకూ ఆరు కేసులు నమోదవడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమాయ్యి, వైరస్ వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కోవడానికి ప్రపంచ బ్యాంకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి, అన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు గాను ఈ నిధులు అందిస్తున్నట్టు మంగళవారం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ ప్రకటించారు. ఇప్పటికే వివిధ దేశాలతో సంప్రదింపు జరుపుతున్నట్టు చెప్పారు. ఏ ఏ దేశలతో సంప్రదింపులు జరిపారనే విషయం చెప్పలేదు. ముఖ్యంగా కరోనాను అడ్డుకునేందుకు భారంగా ఉన్న పేద దేశాలను గుర్తించడం ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యమని, ఇప్పటికే ఆయా దేశాలకు కేటాయించినటువంటి నిధులను వైరస్‌ను అరికట్టడానికి వినియోగించాలని అన్నారు. అలాగే, విధివిధానలను రూపొందించేందుకు, వైద్య సదుపాయాలకు, నిపుణుల కోసం ఆ నిధులను ఉపయోగించాలని సూచించారు. ఇంతకుముందు జికా, ఎబోలా వైరస్‌లు వ్యాప్తించినపుడు సైతం ప్రపంచ బ్యాంకు ఇలాంటి చర్యలనే చేపట్టిందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు గుర్తుచేశారు.

Tags: Coronavirus, Coronavirus In India, World Bank



Next Story

Most Viewed