- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్క్ ఫ్రమ్ హోంతో పెరిగిన పని గంటలు
కరోనా కారణంగా ఉద్యోగుల పనివిధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు అందరూ ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని అలవాటు చేసుకున్నారు. దీంతో ఒకప్పుడు ఎనిమిది గంటలు కచ్చితంగా పనిచేసేవారు ఇప్పుడు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఎక్కువ మీటింగ్‌లు, ఎక్కువ మందితో సమన్వయం కారణంగా పని గంటలు పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల్లోని 21,000 కంపెనీల్లో 3.1 మిలియన్ మంది ఉద్యోగులను సర్వే చేసి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వారు ఈ విషయాలను తెలుసుకున్నారు.
కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు ముందు, తర్వాత సమయాల్లో 8 వారాల పాటు వర్క్ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సర్వే చేశారు. దీని కోసం సంబంధిత ఉద్యోగుల ఈమెయిల్, మీటింగుల డేటాను కూడా పరిశీలించారు. అన్ని గణించి చూస్తే రోజూ సగటున 48.5 నిమిషాలు ఎక్కువగా పనిచేసినట్లు తేల్చిచెప్పారు. అలాగే ఈమెయిళ్లు పంపడం 13 శాతం పెరిగిందని, ఒక్కొక్కరికి సగటున 1.4 మెయిళ్లు ఎక్కువగా అందాయని వెల్లడైంది. ఇప్పటికే నాలుగు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులందరూ ఈ పరిస్థితికి అలవాటై పోయారని ప్రొఫెసర్ జెఫ్ పోల్జర్ అంటున్నారు. వీరి సర్వే ఆధారంగా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం చేయడం వల్ల తగ్గే ఖర్చులను, పెరుగుతున్న ఉత్పాదకతను అంచనా వేసి భవిష్యత్తు కాలానికి నిర్ణయాలు తీసుకుంటాయని జెఫ్ వివరించారు. ఈ కల్చర్‌కు పూర్తిగా అలవాటు పడిన తర్వాత గతంలో మాదిరిగా ఆఫీస్‌కు రావడానికి ఉద్యోగులు సుముఖంగా ఉండకపోవచ్చని ఈ సర్వేలో ప్రధానంగా వెల్లడైంది.