వర్క్ ఫ్రమ్ హోమ్: ఈ డైట్ తప్పక ఫాలో అవ్వండి

147

దిశ, వెబ్ డెస్క్: కరోనా విలయతాండవం ఇప్పట్లో ఆగేలా లేదు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. బెడ్లు సరిపోని ఆసుపత్రులు.. శవాలతో నిండిపోతున్న మార్చురీలు.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకొంటుంది. నైట్ కర్ఫ్యూ లు, లాక్ డౌన్ లు అమలు చేస్తుంది. ఇక ఉద్యోగులు సైతం ఇంటికి పరిమితమయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే పనిచేస్తున్నారు. ఇంట్లో పనిచేసేటప్పుడు కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఆఫీస్ లో ఉన్నట్లు ఇంట్లో ఉండకపోవచ్చు. స్నాక్స్, టీ, కాఫీలు ఇంట్లో చేసుకొనే తీరిక ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహరం పనికి అంతరాయం కలగకుండా  తీసుకోండి. పనికి అంతరాయం కలగకుండా తినే స్నాక్స్ ఏంటివి? అనేవి తెలుసుకుందాం.

బఠాణీలు

ఆరోగ్యకరమైన స్నాక్స్ లో పచ్చి బఠాణీలు చాలా ముఖ్యమైనవి. వీటిలో ప్రోటీన్లు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అంతేకాకుండా ఇవి త్వరగా పాడవ్వవు కూడా.. ఖాళీ సమయంలో బఠాణీలను వేపి పెట్టుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.. మధ్యమధ్యలో వీటిని తింటే.. రిలాక్స్ అవ్వడమే కాదు కొంచెం యాక్టివ్ గా కూడా తయారవుతారు. వీటిని తినడం వలన అటు శక్తి వస్తుంది.. ఇటు విటమిన్స్ వస్తాయి.

పప్పు గింజలు

డ్రై నట్స్.. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్ నట్స్, ఫిగ్స్ లాంటివి మీ ఆహరంలో భాగంగా చేసుకోండి. వీటిలో ఉండే విటమిన్స్ మిమ్మల్ని శక్తివంతంగా మార్చడమే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా  దోహదపడతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మద్యమద్యలో రెండు జీడిపప్పు పలుకులు, వాల్ నట్స్ లాంటివి తింటూ ఉండండి. ఇవి తినడం వలన త్వరగా ఆకలి వేయదు.. పని ఆపి మరీ వెళ్లి స్నాక్స్ తయారుచేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఓట్స్

జిమ్ చేస్తున్నాం.. డైట్ లో ఉన్నాం.. ఏది పడితే అది తింటే మళ్లీ బరువు పెరుగుతాం అనే వారికి ఓట్స్ ఎంతో చక్కని స్నాక్స్. ఓట్స్ ని స్నాక్స్ రూపంలో తీసుకొంటే అధిక బరువు తగ్గుతుంది. అలాగే ఆరోగ్యంగాను ఉంటారు. ఓట్స్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో మీకేది తినాలనిపిస్తే వాటిలో బార్లీ ఫ్లేక్స్‌కి వీట్, రాగి ఫ్లేక్స్ కలిపి తినండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

డార్క్ చాకోలెట్స్

చాకోలెట్స్ .. తినడం వలన వెంటనే మూడ్ మారిపోతుంది. నిద్ర వస్తున్నా, కొంచెం బద్దకంగా ఉన్నా, ఎక్కువగా పనిచేసి అలసట గా ఉన్నా ఒక డార్క్ చాకోలెట్ తినండి. వెంటనే మీ మూడ్ మారిపోతుంది. డార్క్ చాకోలెట్స్ లోను మిల్క్, కోకా ఉన్నాయి ఎక్కువగా తీసుకోండి. తక్కువ క్యాలరీలు ఉండడం వలన అధిక బరువు పెరిగే అవకాశం ఉండదు. ఈ చాకొలెట్లు రోజుకొకటి తింటే పర్వాలేదు.. ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

వాటర్

ఇంట్లోనే ఉంటున్నాం కదా.. దాహం అయినప్పుడే మంచి నీళ్లు తాగుదాం అనుకోవద్దు. వాటర్ ని ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే వేసవిలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. ప్రతిసారి మర్చిపోతున్నామంటే వాటర్ అలారం పెట్టుకోవచ్చు. అది రిమైండ్ చేసినప్పుడు మంచి నీళ్లు తాగండి.

ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకేచోట కదలకుండా కూర్చొని పనిచేస్తుంటారు. అలాంటప్పుడు వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు రావడం సహజం. అందుకే ఎక్కువసేపు కూర్చొని పనిచేసేటప్పుడు మధ్యమధ్యలో కాళ్ళు, చేతులను ఆడిస్తూ ఉండండి. కూర్చొని అటెండ్ అయ్యే మీటింగ్ ని కొద్దీ సేపు నిలబడి అటెండ్ అవ్వండి. కనీసం అరగంటకొక్కసారైనా నాలుగడుగులు వేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..