క్షణికావేశంలో ఆ పని చేసిన మహిళ.. పోలీస్ ఏంచేశాడంటే ..?

by  |
క్షణికావేశంలో ఆ పని చేసిన మహిళ.. పోలీస్ ఏంచేశాడంటే ..?
X

దిశ, ఏపీ బ్యూరో: కుటుంబ కలహాలతో ఓ మహిళ జలాశయంలోకి దూకింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించారు. ఆ మహిళను కాపాడేందుకు జలాశయంలోకి దూకాడు. వెంటనే ఆమెను రక్షించి బయటకు తీసుకువచ్చాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిని కానిస్టేబుల్‌ను ప్రజలు, జిల్లా పోలీస్ శాఖ అభినందించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కలువాయి మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అంతే బుధవారం ఉదయం సోమశిల జలాశయంలో దూకేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సోమశిల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పీఎస్‌లో అందుబాటులో ఉన్న కానిస్టేబుల్ వేణు సోమశిల జలాశయంలోకి దూకి ఆమెను ప్రాణాలతో కాపాడాడు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సమస్యను పరిష్కరించి బాధితురాలిని కుటుంబ సభ్యులతో కలిపి ఇంటికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విజయరావు కానిస్టేబుల్ వేణును అభినందించారు. మహిళ ప్రాణాలను కాపాడటం అభినందనీయమని కొనియాడుతూ రివార్డు అందజేశారు.

Next Story

Most Viewed