కరోనాను ఎదుర్కొనేందుకు ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ భరోసా!

by  |
కరోనాను ఎదుర్కొనేందుకు ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ భరోసా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వేలల్లో మనుషుల్ని బలి తీసుకుంటున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలకు ప్రతిక్షణం అండగా ఉంటామని విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. కరోనాపై యుద్ధానికి విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌తో కలిసి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ. 1,125 కోట్ల నిధులు అందిస్తున్నట్టు ప్రకటించారు. కరోనాపై పోరాడేందుకు తమ సంస్థల తరపున చేపట్టబోయే సామాజిక కార్యక్రమాలు కాకుండా ఈ మొత్తాన్ని కేటాయిస్తున్నామని సంస్థలు వెల్లడించాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం శ్రమిస్తున్న వైద్యుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు.

కరోనాపై పోరులో భాగంగా మూడు సంస్థలు అందించే విరాళాన్ని అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నుంచే అందివ్వనున్నట్టు సమాచారం. విప్రో రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్ రూ. 25 కోట్లు ఇవ్వగా, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1000 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. గతేడాది విప్రో సంస్థల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజమైన అజీమ్ ప్రేమ్‌జీ సామాజిక సేవల కోసం తన సంపదలో 34 శాతాన్ని అంటే రూ. 52,750 కోట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనాపై పోరుకు అండగా నిధులను ఇవ్వడం ఎంతోమందికి ప్రశంసలు అందుతున్నాయి.

Tags: Business, Coronavirus, India, Wipro, Azim Premji



Next Story

Most Viewed