సాధ్యమైనంత వరకు వడ్డీ రేట్లు స్థిరంగానే : ఎస్‌బీఐ ఛైర్మన్!

by  |
సాధ్యమైనంత వరకు వడ్డీ రేట్లు స్థిరంగానే : ఎస్‌బీఐ ఛైర్మన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించే ఉద్దేశ్యంతో అన్ని రకాల వడ్డీ రేట్లను సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా చెప్పారు. కొవిడ్ సెకెండ్ వేవ్ వల్ల ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం బ్యాంకులపై ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతానికి చెప్పలేమని దినేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకైతే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ లేదు కాబట్టి బ్యాంకుల నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ)పై ప్రభావాన్ని అంచనా వేయలేమన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నాయి, కాబట్టి దీనిపై స్పష్టత కోసం మరింత సమయం వేచి ఉండాలన్నారు.

ద్రవ్యోల్బణం సహా పలు కారణాల వల్ల వడ్డీ రేట్లపై ప్రభావం ఉంది. అయితే, వృద్ధి ప్రయత్నాలకు మద్దతివ్వడమే మా ప్రయత్నం ఉంటుంది. ఈ క్రమంలో సాధ్యమైనంతవరకు స్థిరమైన వడ్డీ రేట్లను ఉంచనున్నట్టు ఆయన వివరించారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల వ్యయంతో ఐసీయూతో పాటు 1000 పడకల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. దీనికోసం పలు లాభాపేక్ష లేని సంస్థలతో పనిచేస్తున్నామన్నారు. ఎస్‌బీఐలోని మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగుల్లో 70 వేల మందికి కరోనా టీకా అందించినట్టు దినేష్ స్పష్టం చేశారు. కాగా, శనివారం ఎస్‌బీఐ రూ. 30 లక్షల్లోపు తీసుకునే గృహ రుణ వడ్డీ రేటను 6.70 శాతానికి తగ్గించింది. ఆ పైన రూ. 75 లక్షల్లోపు రుణాలకు రూ. 6.95 శాతం, రూ. 75 లక్షలకు పైన రుణాలకు 7.05 శాతం ఉంటుందని ఎస్‌బీఐ ప్రకటించింది.

Next Story

Most Viewed