జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు పెడతారా : రాజాసింగ్

by  |
జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు పెడతారా : రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ జెండాను ఎగురవేస్తే కేసులు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గోషామాల్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నట్టుగా తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జాతీయ జెండాను ఎగరవేసేందుకు అనుమతి తీసుకోవాలని షహనాజ్ గంజ్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిజాంలా పరిపాలన కొనసాగిస్తున్నారని జాతీయ జెండాను ఎగురవేసే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ప్రతి ఏడాది బేగంబజార్‌లో భగత్ సింగ్ యువసేన కార్యకర్తలు జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి సంబురాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సాకుతో పోలీసులు అనుమతులు ఇవ్వడంలేదని చెప్పారు. ర్యాలీకి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు షహనాజ్ గంజ్ పోలీసుస్టేషన్ కు వెళితే కమిషనరేట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పినట్టుగా పేర్కొన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జాతీయ జెండాను ఎగురవేసి ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed