Exit polls: ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్.. ఏపీ ఎన్నికల్లో 123 ఆ పార్టీకే..!

by Indraja |
Exit polls: ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్.. ఏపీ ఎన్నికల్లో 123 ఆ పార్టీకే..!
X

దిశ వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించారు. అలానే ఎన్నికలు ముగిసిన మూడు రోజుల్లో ఫలితాలు సైతం ప్రకటించారు. కాని ఆంధ్రాలో ఎన్నికలు ముగిసి వారం రోజులు గడుస్తున్నా నేటికీ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది. అయితే తెలంగాణలో 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఎన్నికలు.

అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎఎగ్జిట్ పోల్స్‌ను, ఆ తరువాత ఫలితాలను ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించకూడదు. కాగా దేశవ్యాప్తంగా 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికి 5 దశలు పూర్తయ్యాయి. కాగా జూన్ 1వ తేదికీ అన్ని దశలు పూర్తికానున్నాయి. అలానే జూన్ 1వ తేది సాయంత్రం ఎఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించనున్నారు.

189 ఎలక్షన్స్‌లో పెరిగిన ఓటింగ్ శాతం.. గెలుపు ఎవరి తలుపు తట్టింది..?

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 365 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 189 ఎలక్షన్స్‌లో ఓటింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తోంది. అయితే ఓటింగ్ శాతం పెరిగిన 189 ఎలక్షన్స్‌లో కేవలం 66 సార్లు అధికార పార్టీ గెలిచింది. 123 సార్లు ప్రతిపక్ష పార్టీకే గెలుపు దక్కింది. దీని ప్రకారం చూసుకుంటే ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది.

అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి వరుసగా సెలవులు రావడం సైతం ఓ కారణంగా తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరిగింది అధికార పార్టీని అందలం దించేందుకా..? లేక మళ్లీ అధికార పార్టీకే పట్టం కట్టేందుకా..? లేక కేవలం వరుసగా సెలవులు రావడం కారణంగా ఓటింగ్ శాతం పెరిగిందా..? అనే విషయం తెలుసుకోవాలంటే జున్ 4వ తేది వరకు వేచి చూడాల్సిందే.

Read More..

చంద్రగిరి వైసీపీలో పెను సంచలనం.. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు సస్పెన్షన్



Next Story

Most Viewed