వికీపీడియా @ 20 ఇయర్స్

by  |
వికీపీడియా @ 20 ఇయర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వికీపీడియా…ద ఫ్రీ ఎన్‌సైక్లోపీడియా..ఈ ఒక్క సైట్ మనకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. మరెంతో అందించడానికి కృషి చేస్తోంది. వలంటీర్ ఎడిటర్ల సాయంతో నడిచే వికీపీడియాలో మనం ఏ ఇన్‌ఫర్మేషన్ అయినా ఉచితంగా పొందొచ్చు. దాదాపు అన్ని భాషలకు సంబంధించిన సమాచారమందించే ఈ వికీపీడియా.. 2001, జనవరి 15న జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ సంయుక్తంగా ప్రారంభించారు. సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చేయగలిగే సౌలభ్యం వీకీపీడియాలో ఉండగా, సాంకేతిక ప్రపంచంలోని సమాచారాన్నంతటినీ ఏకీకృతంచేసే ఈ వేదికను క్రౌడ్ సోర్సింగ్ అని అంటారు. కాగా, వికీ ప్రారంభమై నేటికి 20 ఏళ్లు గడిచింది.

‘న్యూపీడియా’ పేరుతో వీకీపీడియాను ప్రారంభించగా, ఆ తర్వాత దీన్ని వికీపీడియాగా మార్చారు. తొలిగా ప్రతీ యూజర్ వీకీపీడియాలో ఎడిట్ చేసే అవకాశం ఉండేది కాదు. వికీ ప్రారంభించిన కొద్ది నెలల తరువాత యూజర్లందరికీ ఇందులో ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ భాషలో మాత్రమే ప్రారంభమైన వికీలో ప్రస్తుతం 316 భాషలకు సంబంధించిన ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా 1.76 బిలియన్ల యునిక్ విజిటర్స్ వస్తుంటారు. 56 మిలియన్ల ఆర్టికల్స్‌ అందించిన వికీలో ఇప్పటి వరకు 3 బిలియన్ల ఎడిట్స్ జరిగాయి. 2,80,000 వలంటీర్లు దీనికోసం పని చేస్తుండగా, హావాయిన్ పదం ‘వికీ’నుంచి దీనికి ఆ పేరు పెట్టారు. వికీ అంటే క్విక్, ఎన్‌సైక్లోపీడియా అనే అర్థం.

జనవరి 2020లో చైనాకు చెందిన ఓ ఎడిటర్ ‘చైనా న్యూమోనియా’పేరుతో ఓ పేజీని ప్రారంభించాడు, అదే కొవిడ్ 19 పేజీగా మారింది. కొవిడ్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఇప్పుడు ఇందులో చేర్చుతున్నారు. ఎన్నో గ్లోబల్ క్యాంపెయిన్స్‌కు వేదికగా వికీ నిలిచింది.



Next Story

Most Viewed