హంద్రీనీవా నీటిని ఎందుకు వాడటం లేదు? సీపీఐ

by  |
హంద్రీనీవా నీటిని ఎందుకు వాడటం లేదు? సీపీఐ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మరో లేఖ రాశారు. హంద్రీనీవాలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నప్పటికీ ఆ నీరు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని లేఖలో పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా సుమారు 106 చెరువులు నింపొచ్చని చెప్పుకొచ్చారు.

ఈ నీటితో దాదాపుగా 10వేల ఎకరాలకు పైగా సాగునీటిని అందిచవచ్చునని లేఖలో ప్రస్తావించారు. అలాగే 150కి పైగా గ్రామాలకు తాగునీటి ఎద్దడికి ముగింపు పలకవచ్చని లేఖలో సూచించారు. మరోవైపు హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు పనులకు సంబంధించి ప్రభుత్వాలు నిధులు విడుదల చేసినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి తాగు, సాగునీటి కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలని లేఖలో రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed