ఈ డైమాండ్‌కు ఎందుకంత డిమాండ్?

by  |
ఈ డైమాండ్‌కు ఎందుకంత డిమాండ్?
X

దిశ, వెబ్‌డెస్క్ :
మూడు బిలియన్ ఏళ్ల నాటి పాత సహజమైన వజ్రాన్ని చేతితో పట్టుకున్నపుడు కలిగే భావన వర్ణించడానికి వీలు కానిది. స్వచ్ఛమైన వజ్రానికి చెప్పలేనంత విలువ ఉంటుంది. దాన్ని పొందినపుడు కలిగే భావన డబ్బుతో కొనగలిగేది కాదు. నిజమైన వజ్రానికి ఎందుకంత విలువ?

ఎప్పటికీ నిలిచి ఉంటుంది

ప్రకృతి సృష్టించిన అత్యంత గట్టి పదార్థం వజ్రం. భూమి లోలోపలి పొరల్లో కొన్ని యుగాల పాటు ఎంతో ఒత్తిడికి గురయ్యాక వజ్రం ఏర్పడుతుంది. తర్వాత ఆ ప్రాంతంలో జరిగిన అగ్నిపర్వత పగుళ్ల కారణంగా వజ్రాలు భూతలానికి వస్తాయి. ఈ లెక్కన చూస్తే వజ్రాల వయస్సు డైనోసార్ల వయస్సు కంటే ఎక్కువేనని చెప్పొచ్చు. ఇప్పుడు దొరుకుతున్న వజ్రాలన్నీ కింబర్లైట్ల ద్వారా లోపలి పొరల నుంచి భూఉపరితలానికి వచ్చినవే. దశాబ్దాల క్రితం కనిపించిన కింబర్లైట్లలో ఇప్పుడు వజ్రాల సంఖ్య తగ్గిపోవడంతో వాటి విలువ మరింత పెరుగుతోంది.

గ్రీకు పదం ‘అడామస్’ నుంచి డైమండ్స్ అనే పదం పుట్టింది. అడామస్ అంటే నాశనం చేయలేనంత గట్టిదని అర్థం. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రం అవసరం తప్పనిసరి. అంతేకాకుండా ఒక వజ్రానికి ఇంకో వజ్రానికి పోలిక ఉండదు. అచ్చం మన వేలిముద్రలలాగే ఏ రెండు వజ్రాలు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండవు. ప్రస్తుతం ప్రయోగశాలల్లో సృష్టిస్తున్న క్యూబిక్ జిర్కోనియా డైమండ్లు, సహజంగా ఏర్పడిన వజ్రానికి ఏ విషయంలోనూ సరిపోలవు.

ఇంత అరుదైనవి కాబట్టే వజ్రాలకు అంత విలువ ఎక్కువ. అందుకే ప్రత్యేకమైన బంధాలకు ప్రతిష్టాత్మక వజ్రం బహుమతిగా ఇస్తే ఆ బంధం విలువైనదని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. కొన్ని సార్లు అదే వజ్రం వారసత్వ సంపదగా మారి వంశానికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

Next Story

Most Viewed