ఆర్ధిక ఇబ్బందులతో కూలీ పని చేసుకుంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత!

by Disha Web Desk 5 |
ఆర్ధిక ఇబ్బందులతో కూలీ పని చేసుకుంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశ అత్తున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు గ్రహీత రోజు వారి కూలి మనిషిగా మారాడు. తెలంగాణ నుంచి కళా రంగంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయంజాల్ లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ.. గత నెల నుంచి తనకు రావాల్సిన నెలవారీ గౌరవ వేతనం 10 వేల రూపాయలు ఆగిపోయిందని ఎవరికి చెప్పిన సానుకూలంగా స్పందిస్తున్నారే తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

తన కొడుకుల్లో ఒకరు మూర్ఛ వ్యాదితో భాదపడుతున్నారని, తనకు, తన కొడుకుకి నెలవారీ మందులు ఇతర ఖర్చుల కోసం దాదాపు రూ.7000 ఖర్చు అవుతుందని, దాని కోసమే కూలీ పని చేయాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశాడు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 కోటి గ్రాంట్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల ఇంటి స్థలం కూడా పెండింగ్ ఉండిపోయాయని పేర్కొన్నారు. కాగా అరుదైన సంగీత వాయిద్యమైన "కిన్నెర" ను తిరిగి వెలుగులోకి తెచ్చినందుకు కేంద్రం ఆయన్ను గుర్తించి 2022 లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ తో సత్కరించింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పాడే అవకాశం లభించడంతో ఆయనకు కీర్తి పెరిగింది.

Next Story

Most Viewed