మాస్కులతోనే కరోనా నియంత్రణ: ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్

by  |
మాస్కులతోనే కరోనా నియంత్రణ: ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్
X

దిశ, నిజామాబాద్: మాస్కులు ధరించడం వల్ల కరోనా వైరస్ నియంత్రించవచ్చని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్‌ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్కూలను కామారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలో గురువారం గంప గోవర్ధన్ విక్రయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాను నియంత్రించడానికి మాస్క్‌లు తోడ్పడతాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు. మెప్మా ఆధ్వర్యంలో 80 వేల మాస్కులు విక్రయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నావి, వైస్‌చైర్‌పర్సన్ ఇందూ ప్రియా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంతకుముందు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో రూ. 2 లక్షల విలువైన కిట్లను వైద్యులు, సిబ్బందికి గంప గోవర్ధన్ అందజేశారు.

Tags: Nizamabad,Whip Gampa govardhan reddy,Masks,sell



Next Story

Most Viewed