ఏది సీజనల్ జ్వరం, ఏది కరోనా..?

by  |
seasonal fever, corona fever
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇది కరోనా టైం. ఏ డిసీజ్ వచ్చినా కరోనా అనే భయపడే రోజులు ఇవి. గతంలో తీవ్రమైన జ్వరం వచ్చినా భయపడని వారు.. నేడు శరీరం కొంచెం హీటెక్కినా అమ్మో కరోననా? అనే అమనుమానపడుతున్నారు. జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పి ఇలా ఏది వచ్చినా కరోనా వైపే మనసు మళ్లుతోంది. అయితే ఏది కరోనా జ్వరం, ఏది సీజనల్ జ్వరమో తెలుసుకుందాం.

ఇలా ఉంటే సీజనల్ జ్వరమే..

సీజనల్ జ్వరం 104 డిగ్రీల వరకు వస్తుంది. అంత జ్వరం వచ్చినా మూడు, నాలుగు రోజుల్లో తగ్గుముఖం పడుతుంది. జ్వరంతోపాటు జలుబు చేసి ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. ఇన్ని ఉన్నా రుచి, వాసన తెలుస్తాయి. ఒళ్లునొప్పులు, తలనొప్పి సాధారణంగానే ఉంటాయి. దగ్గు వల్ల గొంతు నొప్పి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే సాధారణ జ్వరమే అనుకోవాలి. అయినా డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.

ఇలాంటి జ్వరాన్ని అనుమానించాల్సిందే..

సీజనల్ జ్వరానికి, కరోన జ్వరానికి లక్షణాలు దగ్గరి పోలికలు ఉన్నా.. కొన్ని తేడాలతో కరోనా సోకినట్లు గుర్తించవచ్చు. కరోనా వైరస్ సోకితే మూడు రోజులకు పైగా తీవ్రమైన జ్వరం ఉంటుంది. జలుబు ఉంటుంది కానీ ముక్కు కారదు. పొడి దగ్గు వస్తుంది. ఏమి తిన్న రుచి, వాసన తెలియదు. ఒళ్లంతా తీవ్రమైన నొప్పులు, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. గొంతు నొప్పి,ఛాతి నొప్పి ఉండడంతో బాటు కండ్లు ఎర్రబడుతాయి. వాంతులు, విరేచనాలు అవుతాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు పాటించి చికిత్స తీసుకోవాలి. అయితే కరోనా సెకండ్ వేవ్‌లో ఎలాంటి లక్షణాలు లేకుండనే పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. ఏ చిన్న అనుమానం ఉన్నా వైద్యులను సంప్రదించాలి. పై సూచనలు కూడా డాక్టర్ల సూచన మేరకు అందించినవిగా భావించాలి.


Next Story

Most Viewed