అంధుల ప్రమాదాలను తగ్గించే వీడియో కెమెరా, వైబ్రేటింగ్ బ్యాండ్!

by  |
అంధుల ప్రమాదాలను తగ్గించే వీడియో కెమెరా, వైబ్రేటింగ్ బ్యాండ్!
X

దిశ, ఫీచర్స్ : అంధులు, దృష్టి లోపమున్నవాళ్లు తాము వెళ్లే దారుల్లో అడ్డంకులను గుర్తించడానికి చేతికర్ర(గైట్ డాగ్)లను ఉపయోగిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నా, ఎంత శ్రద్ధగా నడుస్తున్నా కొన్ని సమయాల్లో ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా శాస్ర్తవేత్తలు చెస్ట్‌ మౌంటెడ్‌ వీడియో కెమెరాతో పాటు వైబ్రేటింగ్‌ బ్యాండ్‌ను పరిచయం చేశారు.

దృష్టి లోపాలున్న వ్యక్తులు గుద్దుకోవటంతో పాటు, పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని, కొత్తగా రూపొందించిన చెస్ట్‌ మౌంటెడ్‌ వీడియో కెమెరా, వైబ్రేటింగ్ రిస్ట్‌బ్యాండ్ ధరించడం వల్ల 37 శాతం ప్రమాదాలను తగ్గించవచ్చని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని మాస్ జనరల్ బ్రిఘం హాస్పిటల్ బృందం తెలిపింది. చెస్ట్‌ మౌంటెడ్‌ వీడియో కెమెరాను ఛాతికి ధరించేలా రూపొందించగా, ఇది ఎదురుగా ఏదైనా అడ్డుగా ఉన్నా, వాహనం ఎదురుగా వస్తున్నా వెంటనే యూజర్‌‌‌ను అలర్ట్‌ చేస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల వస్తువుల కదలికల ఆధారంగా చిత్రాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది.

ఇక చేతికి ధరించే వైబ్రేడెట్ బ్యాండ్ కూడా ఇదే తరహాలో అడ్డుగా ఉన్న వస్తువును గుర్తించి వెంటనే వైబ్రేట్ అవుతుంది. ఈ గ్యాడ్జెట్ల ద్వారా కరెంట్‌ పోల్స్‌, మ్యాన్ హోల్స్ వంటి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం ద్వారా చూపులేని వారు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరాలను మరింత సౌకర్యవంతగా తయారుచేసే ప్రయత్నాల్లో పరిశోధకులుండగా, దీన్ని ‘యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ ఆమోదం కోసం సమర్పించారు. అక్కడ అప్రూవల్ అందుకుంటే దృష్టి లోపమున్నవారికి త్వరలోనే వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది.

దృష్టి లోపమున్న చాలా మంది రోజువారీ జీవితంలో ఒంటరి ప్రయాణం చేస్తుంటారు. కానీ ఈ సమయంలో వాళ్లు అడ్డంకులను ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు మేం ప్రయత్నించాం. ఇది వారికి తప్పనిసరిగా ఉపయోగపడే పరికరం. వారి భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’ పరిశోధకుల బృందం తెలిపింది.

Camera-Device

Next Story

Most Viewed