వ్యాక్సిన్ వేస్టేజ్ చేయడమంటే నేరపూరిత వృథానే : ఢిల్లీ హైకోర్టు

by  |
వ్యాక్సిన్ వేస్టేజ్ చేయడమంటే నేరపూరిత వృథానే : ఢిల్లీ హైకోర్టు
X

న్యూఢిల్లీ : ఒకవైపు ప్రజలు కరోనా వ్యాక్సిన్ అందక చచ్చిపోతుంటే పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాటిని వృథా చేయడం ‘నేరపూరిత చర్యే’ అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 44 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు (23 శాతం) వృథా అయ్యాయనే ఆర్టీఐ సమాచారంతో దాఖలైన పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్లు దొరక్క యువకులు సైతం చనిపోతుంటే.. వాటిని వృథా చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘కొవిడ్ నుంచి ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను వృథా చేయడమనేది నేరపూరిత వృథా వంటిదే. దీనిమీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి అన్ని వ్యాక్సిన్లను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖా పల్లి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గతేడాది వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా దారుణంగా విఫలమయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, పేటెంట్ హక్కులు కలిగి ఉన్న సంస్థలతో మాట్లాడి వాటి ఉత్పత్తులను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Next Story

Most Viewed