తేలిన 3వ రౌండ్ ఫలితం.. 12వేల పైచిలుకు ఆధిక్యంలో 'పల్లా'

by  |
తేలిన 3వ రౌండ్ ఫలితం.. 12వేల పైచిలుకు ఆధిక్యంలో పల్లా
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మూడో రౌండ్ ఫలితం తేలింది. ఈ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యం కనబరిచారు.

మూడో రౌండ్ ఓట్ల లెక్కింపులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15558 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 10748, కోదండరాం -11032, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి – 6615, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 వచ్చాయి. మూడో రౌండ్‌లో చెల్లుబాటు కాని ఓట్లు 2789కావడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 12681 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొత్తం 49380 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు మొత్తం 37238, ప్రొఫెసర్ కోదండరామ్‌కు మూడు రౌండ్లలో మొత్తం 30435, ప్రేమేందర్ రెడ్డికి మూడు రౌండ్ల మొత్తం 19953, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌ ఐదో స్థానంలో, రాణిరుద్రమరెడ్డి ఆరో స్థానంలో, చెరుకు సుధాకర్‌ ఏడో స్థానంలో, జయసారథిరెడ్డి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 12 కొత్త జిల్లాల పరిధిలో 3,85,996 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు 1,92,999 ఓట్లు రావాల్సి ఉంది. మొత్తం ఏడు రౌండ్లలో వెలువడనున్న ఈ ఫలితాల్లో.. ఓక్కో రౌండ్‌లో 56,000 వేల ఓట్ల చొప్పున లెక్కించనున్నారు.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇదిలావుంటే.. మూడు రౌండ్లలో చెల్లుబాటు కాని ఓట్లు 8వేలకు పైగా ఉండడం గమనార్హం.

CUMMULATIVE AFTER 3RD ROUND-1


Next Story

Most Viewed