- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వివేకానంద విదేశీ విద్య పథకానికి దరఖాస్తులు ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2021-2022 సంవత్సరానికి వివేకానంద విదేశీ విద్య పథకానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పరిషత్తు అధ్యక్షుడు కేవీ రమణాచారి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ కార్యాలయంలో మాట్లాడారు. విద్యార్థులు ఈనెల 29 నుంచి మే28 వరకు వెబ్ సైట్ www.brahminparishad.telangana.gov.in లో ధృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు(బెస్ట్) పథకం కింద ఎంపికైన 270 మంది లబ్ధిదారులకు 6కోట్ల 96లక్షల18వేల 959 రూపాయలను సబ్సిడీ రూపంలో వారి వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద 18 మందికి 2లక్షల 49 వేల 750 రూపాయలను అందజేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్యదర్శి వి. అనిల్ కుమార్, సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వేణుగోపాలాచారి, పురాణం సతీష్, డాక్టర్ సువర్ణ సులోచన, పరిషత్తు పాలనాధికారి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.