విశాఖకు భూకంపాలు, సునామీ ముప్పు

by  |
విశాఖకు భూకంపాలు, సునామీ ముప్పు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు దిశగా ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బిల్లులు గవర్నర్ వద్దకు వెళ్లాయి. ఆయన ఆమోద ముద్రవేస్తే ఏపీలో మూడు రాజధానులు పట్టాలెక్కినట్లే..! దీంతో విశాఖపట్టణం ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉంటుంది. అయితే ఏపీకీ విశాఖపట్టణం భవిష్యత్ రాజధాని అందరూ చెప్పుకుంటున్న తరుణంలో హెచ్‌యూసీ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) సంచలన అధ్యయాన్ని బయటపెట్టింది. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఫాల్ట్ లైన్ (భ్రంశ రేఖ) ఉందని..దీంతో విశాఖపట్టణానికి భూకంపాలు, సునామీ ముప్పు పొంచి ఉందని తమ అధ్యయానంలో వెల్లడైందని హెచ్‌యూసీ వెల్లడించింది.

తూర్పుతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కి.మీ. పొడవున ఫాల్ట్‌లైన్‌ ఉన్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(NOA), హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హెచ్‌సీయూకి చెందిన డాక్టర్‌ ఇస్మాయిల్‌, ఎన్ఐఓకు చెందిన డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఓఎన్జీసీకి చెందిన డాక్టర్‌ సాహా ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. పరిశోధన ఫలితాలను ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే‘జర్నల్‌ ఆఫ్‌ ఎర్త్‌ సిస్టం సైన్స్‌’లో ప్రచురించారు.

ఐతే ఈ రీసెర్చ్‌ను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. విశాఖలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజలను భయపెడుతున్నారని..ఈ మహా నగరం ఏం పాపం చేసిందని ఆయన ప్రశ్నించారు. వీటి ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదల్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ ప్రజలతో మాకు రాజధాని వద్దని చెప్పించేలా ఉన్నారంటూ విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు.



Next Story

Most Viewed