కోదండరాం మాటలు బాధాకరం: వినోద్ కుమార్

by  |
కోదండరాం మాటలు బాధాకరం: వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో ప్రొఫెసర్ కోదండరాం ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదన్నారు. ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రొఫెసర్ కోదండరాంకు అపోహలు ఉండటం బాధాకరమన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒక ప్రొఫెసర్‌గా ఆయనకు తెలిసినా విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్యోగాల నియామకాల్లో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక కోర్టు కేసులను దాటుకుంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాది ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సభ్యులను ఆయన అభినందించారు.

Next Story

Most Viewed