మా ఊర్లో ‘కరోనా ఖననాలు’ చేయొద్దు : గామస్తుల నిరసన

by  |
మా ఊర్లో ‘కరోనా ఖననాలు’ చేయొద్దు : గామస్తుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ గ్రామాల్లో కల్లోలం సృష్టిస్తుంది. ఇన్ని రోజులు అన్నదమ్ముల వలే కలిసున్న ప్రజల్లో దూరాన్ని పెంచుతోంది. ఇదివరకు ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అందరూ హాజరయ్యేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా బారిన పడి మరణించిన వారు తమ గ్రామం, ఒకే కుటుంబంలోని వారైనా ఖననానికి గ్రామస్తులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కరోనా మృతులను తమ గ్రామ సమీపంలో ఖననం చేయవద్దంటూ గుంటూరు జిల్లాలోని ఓబులనాయుడుపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

కరోనా మృతుల అంత్యక్రియల కోసం ఓబులనాయుడుపాలెం సమీపంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ గ్రామం పక్కన ఖననాలు చేయడానికి వీలు లేదంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుండా, గ్రామస్తులంతా కలిసి ఆందోళనకు దిగారు.

Next Story

Most Viewed