మహాత్ముడి మాటలు గుర్తుకొస్తున్నాయ్: విజయశాంతి

by  |
మహాత్ముడి మాటలు గుర్తుకొస్తున్నాయ్: విజయశాంతి
X

కరోనా దృష్ట్యా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మహాత్ముడు చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయని అన్నారు. భూ ప్రపంచంపై ఉన్న ప్రతి ప్రాణి ఆకలిని ప్రకృతి తీరుస్తుంది కానీ అత్యాశను కాదని మహాత్ముడు చెప్పిన మాటలను విజయశాంతి గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పెద్దపెద్ద వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేసి నిత్యావసరాలను మాత్రమే ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.

Tags: vijayshanthi,twitter,remind,mahatma gandhi

Next Story

Most Viewed