ప్రభుత్వ కార్యాలయాల్లో 'విజయ' పాలు..

by  |
ప్రభుత్వ కార్యాలయాల్లో విజయ పాలు..
X

దిశ, న్యూస్ బ్యూరో: అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ‘విజయ’ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఉపయోగించేలా త్వరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలా చూస్తానని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయ్ యాదవ్ తెలిపారు. రాజేంద్ర నగర్‌లో రూ. 240 కోట్లతో నిర్మించే మెగా డెయిరీలో అత్యాధునిక మెషనరీలను ఉపయోగించాలని సూచించారు. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సరఫరా తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పాల సరఫరా, సేకరణలో అధికారులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీనీ ఉపయోగించుకుని అద్భుతమైన ప్యాకింగ్‌, మరింత నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజలను ఆకర్షించాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Telangana, Talasani, milk, vijaya dairy, Govt



Next Story

Most Viewed